ప్రభుత్వాల అంకెల గారడీ
జీడీడీపీ/జీడీవీఏ లెక్కల్లో ప్రభుత్వాలు అంకెల గారిడీ కి పాల్పడుతున్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా అంకెలు వేసుకుంటున్నాయి. జిల్లా/రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జీడీడీపీ/జీడీవీఏ గణాంకాలు దర్పణం పడుతాయి. ఇది పూర్తి పా రదర్శకంగా జరగాలి. నేడు ప్రభుత్వాలు ఆర్భాటాల కోసం జీవీఏను అమాంతం పెంచేసుకుంటూ పోతున్నాయి. కర్నూలు జిల్లాలో జీడీవీఏ రూ.11వేల కోట్లకుపైగా లక్ష్యాన్ని నిర్ణయించుకోవడాన్ని పరిశీలిస్తే అంకెల గారిడీకి అద్దం పడుతోంది. – ప్రొఫెసర్ మన్సూర్ రహిమాన్,
ఆర్థిక విశ్లేషకులు, కర్నూలు


