నేడు శ్రీశైలం రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
శ్రీశైలం టెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దర్శనార్థం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీశైలం రానున్నారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని రాత్రి బస చేసి, శనివారం ఉదయం మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
చౌడేశ్వరిదేవి దీక్ష విరమణ
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరిదేవి దీక్షను 200 మంది భక్తులు గురువారం విరమించారు. ఇరుముడులతో అమ్మవారి భక్తిగీతాలు పాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయలో ఆవరణలో పూర్ణాహుతి అనంతరం మాలధారులు తమ దీక్షను విరమించారు. భక్తులకు దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ కుమార్‌రెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


