అయ్యో.. కుయ్యో.. మొర్రో !
ఎరుక్క పోయి ఓ శునకం మూతి డబ్బాలో ఇరుక్కుపోయింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ శునకానికి స్వీట్ల డబ్బా కనిపించింది. దీంతో వెంటనే మూతి డబ్బాలోకి పెట్టడంతో ఇరుక్కు పోయింది. ఈ ఘటన మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇరుక్కున్న డబ్బాను స్థానికులు తొలగించేందుకు ప్రయత్నించినా పరుగులు తీసింది. కాసేపటికీ అలసిన శునకం నిద్రించేందుకు నీడకు చేరుకోగా.. పక్కనే ఉన్న వారు మెల్లగా వెళ్లి దాన్ని పట్టుకుని డబ్బాను తొలగించారు. హమ్మ య్యా.. అంటూ కుక్క పరుగులు పెడుతూ తన పిల్లల చెంతుకు చేరి పాలుపట్టింది.
– దొర్నిపాడు


