శతాధిక వృద్ధురాలి మృతి
పాణ్యం: పాణ్యం గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు పీవీ జగన్నాథరావు తల్లి జనజకబాయి (104) గురువారం మృతి చెందింది. ఆమె భర్త పీవీ రామచంద్రరావు రైల్వే కాంట్రాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈ కుటుంబం కాంగ్రెస్‌లో చాలా ఏళ్ల పాటు కొనసాగింది. బెంగళూరులో చిన్న కుమారుడి వద్ద ఉన్న జనజకబాయి గురువారం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.
ఏ కష్టం వచ్చిందో..
మహానంది: పెద్ద మని షినికి ఏ కష్టం వచ్చిందో తెలియదు. మహానందీశ్వరుడి దర్శనానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి నల్లమల అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు...అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పెద్దమల్లెపల్లె గ్రామానికి చెందిన కంచన రామాంజనేయులు రెడ్డి బుధవా రం తన కుటుంబ సభ్యులకు చెప్పి మహానందికి చేరుకున్నాడు. కాగా గురువారం ఉదయం మహానంది ఆలయం వెనుక ఉన్న నల్లమల అడవిలోకి వెళ్లి నామాలతిప్ప సమీపంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వంట చెరుకు కోసం వెళ్లిన కొందరు గుర్తించి వెంటనే బయటికి తరలించారు. 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బ యటపడ్డాడు.వృద్ధుడి కుమారులకు సమాచా రం అందించామని ఎస్‌ఐ వివరించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
స్వర్ణ రథంపై
ప్రహ్లాదరాయల విహారం
మంత్రాలయం: శ్రీ మఠంలో గురువారం రాత్రి మంగళ వాయిద్యాల మధ్య బంగారు రథంపై ప్రహ్లాద రాయలు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వలస కూలీ మృతి
నందవరం: బతుకు దెరువు కోసం ఒడిసా రాష్ట్రం నుంచి వచ్చి ముగతి ఇట్టుకల బట్టిలో పని చేస్తున్న అనూర్ మాఘి(30) మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌ఐ ఇట్టుకల బట్టి వద్ద ఒడిసా రాష్ట్రం నువపాడ జిల్లా కిటిక గ్రామానికి చెందిన ఐదుగురు 15 రోజుల క్రితం పనిలో చేరారు. బుధవారం ఇట్టుకల బట్టిలో అనూర్ మాఘి క్రేన్ వద్ద పని చేస్తుడడంతో ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడు బావమరిది భువన ధ్రువ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుభాన్ తెలిపారు.
శతాధిక వృద్ధురాలి మృతి
శతాధిక వృద్ధురాలి మృతి


