ఆదోని బంద్‌ సంపూర్ణం | - | Sakshi
Sakshi News home page

ఆదోని బంద్‌ సంపూర్ణం

Dec 11 2025 8:28 AM | Updated on Dec 11 2025 8:28 AM

ఆదోని

ఆదోని బంద్‌ సంపూర్ణం

ఆదోనిలో భీమాస్‌ సర్కిల్‌ వద్ద వైఎస్సార్సీపీ నాయకుల ఆందోళన

స్కూటీ నడుపుతూ బంద్‌లో ర్యాలీగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని టౌన్‌/రూరల్‌/అర్బన్‌/సెంట్రల్‌: ఆదోని జిల్లా కోసం అఖిలపక్ష, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం బంద్‌ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, ప్రకాష్‌జైన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆదోని ఇన్‌చార్జి దేవిశెట్టి ప్రకాష్‌, అగ్రి ఫర్టిలైజర్స్‌ సీడ్స్‌ అసోసియేషన్‌ నాయకులు అశోకానందరెడ్డి, బంగారం షాపుల అసోసియేషన్‌ నాయకులు మద్దతు తెలియజేశారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి భీమాస్‌ సర్కి ల్‌ వరకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బైకుపై ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి మద్దతు తెలిపారు.

జగనన్న హామీ ఇచ్చారు

రిలే దీక్షా శిబిరం వద్ద మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ఆదోని జిల్లా అయితే అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆదోని ప్రాంతానికి మెడికల్‌ కళాశాలను కేటాయించాలని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేసిన వెంటనే మంజూరు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పార్లమెంట్‌ స్థానాలనే జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని జగనన్న హామీ ఇచ్చారన్నారు.

చంద్రబాబు అన్యాయం చేశారు

చంద్రబాబు ప్రభుత్వంలో రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలను చేశారని, వాటితో పాటు ఆదోని చేయకుండా అన్యాయం చేశారని సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదోని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు ఆదోని ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. ఆదోని జిల్లాను సాధించుకునేందుకు తాము ముందుంటామన్నారు. అందరూ కలిసి మద్దతు తెలుపుతుండడం సంతోషంగా ఉందన్నారు.

ఐదు నియోజకవర్గాల్లో ఆందోళనలు

ఆదోని బంద్‌కు మద్దతుగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ప్రజలు ఆందోళనలు చేశారు. ఆదోని జిల్లా తప్పకుండా చేయాల్సిందేనని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదోని జిల్లా అయితే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. మార్కెట్‌యార్డులో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. సాగు, తాగునీరు వస్తాయన్నారు.

పోలీసుల అత్యుత్సాహం

ఆదోని పట్టణంలో బుధవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమయ్యింది. ఉదయం 5 గంటల నుంచి సాధన కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన గళం విప్పారు. ఆర్టీసీ డిపో దగ్గర బస్సులు వెళ్లకుండా ప్రగతిశీల మహిళా నాయకురాలు సుజ్ఞానమ్మ, బీఎస్‌ఎఫ్‌ నాయకులు ఉదయ్‌, సీఐటీయూ నాయకులు వీరేష్‌, ఇతర పార్టీల నాయకులతో కలిసి బస్సులను అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న టూటౌన్‌ పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంద్‌లో పాల్గొన్న వారిని పక్కకు లాగేశారు. దీంతో ప్రజలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు

బంద్‌లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. ఆయా పాఠశాల లు, కళాశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.

జిల్లా కోసం కదంతొక్కిన ప్రజలు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో

బైక్‌ ప్రదర్శన

మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

సాయిప్రసాద్‌ రెడ్డి

ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని

డిమాండ్‌

ఆదోని బంద్‌ సంపూర్ణం1
1/3

ఆదోని బంద్‌ సంపూర్ణం

ఆదోని బంద్‌ సంపూర్ణం2
2/3

ఆదోని బంద్‌ సంపూర్ణం

ఆదోని బంద్‌ సంపూర్ణం3
3/3

ఆదోని బంద్‌ సంపూర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement