 
															ఉల్లి, పత్తికి ఎక్కువ నష్టం
మా జిల్లాలో ఉల్లి, పత్తికి ఎక్కువ నష్టం జరిగింది. ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50 వేల పరిహారం ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. రైతులంతా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా విధి విధానాల రూపకల్పనలోనే ఉన్నామని చెబుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అతివృష్టి, అనావృష్టి. అని ప్రజలు అనుకుంటున్నారు. ఉల్లి పంటకు ఇంత ముందు రూ.1200 ఇస్తామని కొన్నారు. కానీ, రైతులకు ఆ రూ.1200 ఇప్పటికీ ఇవ్వలేదు. దాదాపు 75 శాతం రైతులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
– ఎస్వీ మోహన్‌రెడ్డి,
పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
