 
															ప్రైవేటు చెక్ పోస్టులు ఎత్తేయాలి
● నాపరాతి పరిశ్రమ యజమానులు,
కార్మికుల ఆందోళన
బేతంచెర్లలో నిరసన తెలుపుతున్న నాపరాతి పరిశ్రమ కార్మికులు
ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్ట్ వద్ద నిలిచిన నాపరాళ్ల ట్రాక్టర్లు
బేతంచెర్ల: నాపరాళ్ల పరిశ్రమకు పాత పద్ధతిలోనే రాయల్టీలు మంజూరు చేస్తూ, ప్రైవేటు చెక్‌పోస్టులు ఎత్తేయాలని మైనింగ్, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం పట్టణంలోని బనగానపల్లె రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు రాయల్టీ చెక్ పోస్టు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమపై రాయల్టీలు పెంచడమే కాకుండా ప్రైవేటుకు అప్పగించడం ఎంత వరకు సమంజసం అన్నారు. సంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా పెద్ద తరహా పరిశ్రమలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమలను నడుపుకోలేక పోతున్నామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యజమానులు, కార్మికులు వెంకటేశ్వర్లు, చింతల నాగిరెడ్డి, మోహన్ రావు, నాగేశ్వరరావు, ఓబులేసు, సుబ్రమణ్యం, నాగేష్, లక్ష్మి కాంతారెడ్డి, ఉపేంద్ర, ప్రసాద్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
 
							ప్రైవేటు చెక్ పోస్టులు ఎత్తేయాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
