
డ్రైనేజీలో మహిళ మృతదేహం
● హత్యగా అనుమానం
నంద్యాల: పట్టణంలో డ్రైనేజీలో గుర్తు తెలియని మహిళ శవం కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. టూటౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపిన మేరకు.. స్థానిక రామనాథరెడ్డినగర్ సమీపంలోని పార్కు వద్ద ఉన్న డ్రైనేజీలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతురాలి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుంది. మహిళ మృతి చెంది నాలుగు రోజులై ఉండటంతో శరీరం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతురాలు ఐదు అడుగుల పొడవు, ఆకుపచ్చ లంగా, గులాబీరంగు రవిక, పూలడిజైన్ ఉన్న సిమెంట్ రంగు చీర ధరించింది. మృతురాలి రవికలో ఉన్న పరుసులో రెండు వందల నోట్లు 9, వందరూపాయల నోట్లు నాలుగు, రెండు తాళం చెవులు, కొన్ని షాంప్ ప్యాకెట్లు ఉన్నాయి. 36వ వార్డు వీఆర్‌ఓ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిస్తే 9121101085ను సంప్రదించాలన్నారు. కాగా డ్రైనేజీ కాల్వలో మహిళ శవం వెలుగు చూడటంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా..మద్యం మత్తులు ఎవరైనా దాడి చేసి చంపేశారా..? కుటుంబ కలహాలతో హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యా ప్తులో వాస్తవాలు వెలుగు చూడ నున్నాయి.
కుటుంబ గొడవలతో..
కోసిగి: స్థానిక బస్టాండ్ సమీపంలో వడ్డే వీదిలో నివా సం ఉంటున్న వడ్డే రామకృష్ణ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో గొడవ పడి మనస్థాపంతో ఇంట్లో తలుపు వేసుకుని ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దించారు. అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. డాక్టర్ రాజకిరీటి ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదోనికి తరలించారు.

డ్రైనేజీలో మహిళ మృతదేహం