
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
కర్నూలు: కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలోని కేవీఆర్ కాలేజీ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు. రోడ్డుపై అనా థ శవం పడి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరు కుని మృతదేహాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాల్లో ఆరా తీశారు. ఈనెల 1వ తేదీ సాయంత్రం నుంచి మృతదేహం అక్కడే పడివున్నట్లు స్థానికులు తెలిపారు. సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉండి తెలుపు, అడ్డు గీతలు కలిగిన టీషర్టు, నలుపు రంగు షార్ట్ ధరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 91211 01060, 08518–220189కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రెండో పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.