
30న వక్ఫ్ బచావో బహిరంగ సభ
కర్నూలు (టౌన్): నగరంలోని ఎస్‌టీబీసీ కళశాల క్రీడా మైదానంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ‘వక్ఫ్ బచావో– దస్తూర్ బచావో’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం సాయంత్రం ఎస్వీ కాంప్లెక్స్‌లో ముస్లిం నేతలతో కలిసి ఎస్వీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డు పనిచేస్తోందన్నారు. ఈ బోర్డు కింద లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తాహుఫజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హమీద్, వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ నగర అద్యక్షులు పత్తా బాషా, అవాజ్ కమిటీ నగర అధ్యక్షుడు షరీఫ్, అమానుల్లా మౌలానా సాహెబ్, సౌఖత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి