కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో గాలుల తీవ్రతే కొనసాగనుంది. ఈ నెల 25న ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి గాలుల తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులను వర్షాలు నిరాశకు గురి చేస్తున్నాయి.
ఇప్పటి వరకు పత్తి, కంది, వేరుశనగ పంటలు సాగు చేసినప్పటికీ వర్షాలు లేక మొక్కలు ఎదగడం లేదు. కాగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వెల్దుర్తిలో 4.2 మి.మీ, హొళగుందలో 3.2, మద్దికెరలో 2.8, ఓర్వకల్‌లో 1.2, గోనెగండ్లలో 1.2, ఆదోనిలో 1.2, కృష్ణగిరిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.


