
బాబూ.. దాహం తీర్చండి
కౌతాళం: పక్షం (15) రోజులుగా మంచినీరు లేకపోవడంతో కౌతాళంలోని అత్తర్‌వీధికి చెందిన ప్రజలు సోమవారం రోడ్డు ఎక్కారు. కౌతాళం అంబేద్కర్ సర్కిల్‌లో ఖాళీబిందెలతో బైఠాయించారు. ‘బాబూ.. దాహం తీర్చండి’ అంటూ నినదించారు. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి ప్రకాశం, సర్పంచ్ పాల్‌దినకర్‌లు అక్కడి చేరుకుని ప్రజలతో చర్చించారు. ‘మంచినీరు 15 రోజులకొకసారి వదులుతారా ఇది ఎక్కడి న్యాయం’ ప్రజలు అడిగారు. ఈనెల 6 నుంచి మంచినీరు రావడం లేదని నిలదీశారు. తమ కాలనీలో కాదు గ్రామంలో ఎక్కడా చేతిపంపు కూడా లేదని నీటి కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. రోడ్డు ప్రజలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఉప్పరవీధి నుంచి అత్తార్ వీధి తాగునీరు వదిలారు. పోలీస్టేషన్ నుంచే వచ్చే పైప్‌లైన్‌కు డమ్మీ ఏర్పాటు చేసి ఉప్పరవీధి నుంచే తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పైప్‌లైన్ నుంచి కూడా నీరు రాకపోతే వాల్ ఏర్పాటు చేస్తామని సర్పంచ్ పాల్‌దినకర్ హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఆందోళన విరమించారు.
మంచి నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు