
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఎమ్మిగనూరు రోడ్డు బైపాస్ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన ప్రకాష్‌పాల్, యోగేష్‌పాల్, సురేష్‌పాల్‌లు శనివారం పని నిమిత్తం ఎమ్మిగనూరుకు వెళ్లారు. అక్కడ పని మునిగించుకుని శనివారం అర్ధరాత్రి ఆదోనికి బైకుపై వస్తుండగా పట్టణశివారులోని ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ప్రకాష్‌పాల్ చికిత్స పొందుతూ మృతిచెందారు. యోగేష్‌పాల్, సురేష్‌పాల్‌కు తీవ్ర గాయాలు కావడంతో వారిని వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. యోగేష్‌పాల్‌ను బళ్లారికి తరలించగా, సురేష్‌పాల్ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు ప్రకాష్‌పాల్‌కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
నల్లమల ఘాట్‌లో తప్పిన పెను ప్రమాదం
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు చింతమాను టర్నింగ్ సమీపంలో ఢీకొన్నాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో రెండు కార్లల్లో ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మహానంది, రోడ్‌సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టిప్పర్ ఢీకొని
వ్యక్తి దుర్మరణం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని ప్‌లైవర్‌పై టిప్పర్ ఢీకొని వడ్డుగండ్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వడ్డుగండ్ల గ్రామానికి చెందిన నల్లబోతుల రాంభూపాల్(40) బైక్‌పై పాణ్యంలోని ఎస్సార్బీసీ కాల్వ సమీపంలోని డోజర్ పని విషయం మాట్లాడేందుకు వెళ్తుండగా ఏపీ 05టీఈ2355 నంబర్ గల టిప్పర్ లోడ్‌తో ఎదురై ఢీకొంది. ఈ ఘటనలో నల్లబోతులు రాంభూపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానిక గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి