
అభివృద్ధి, సంక్షేమ సమ్మిళితంగా విజన్ ప్లాన్
కర్నూలు(అర్బన్): అభివృద్ధి, సంక్షేమ సమ్మిళితంగా విజన్ ప్లాన్‌ను రూపొందించాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ నవ్య ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల విజన్ కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా స్టేక్ హోల్డర్లతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలన్నారు. విజన్ ఆంధ్రలో ఉంటే పది సూత్రాలు.. జీరో పావర్టీ, అగ్రికల్చర్ సెక్టార్, వాటర్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్‌మెంట్, సోషల్ సెక్యూరిటీ ఆధారంగా విజన్ ప్లాన్‌ను రూపొందించాలన్నారు. సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. ప్లానింగ్ డిపార్టుమెంట్ అడ్వైజర్ సీతాపతి మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో రూపొందించే ప్రణాళికకు చాలా ప్రాముఖ్యత ఉందని, ముఖ్యమంత్రి స్వయంగా చూస్తారన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్, సీపీఓ హిమ ప్రభాకర్‌రాజు, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, భరత్, నంద్యాల సీపీఓ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ నవ్య

అభివృద్ధి, సంక్షేమ సమ్మిళితంగా విజన్ ప్లాన్