
ఆర్‌యూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ కృష్ణా
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డిని నియమితులయ్యారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు కృష్ణారెడ్డిని నియమించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌యూలో ఇప్పటి వరకు ఆర్ట్స్, సైన్స్ కళాశాలలకు విడివిడిగా ప్రిన్సిపాల్స్ ఉండగా రెండింటినీ కలిపి ఒకే కళాశాలగా మార్పు చేశారు. ఈనేపథ్యంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న కృష్ణారెడ్డిని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో పాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సెంట్రల్ లైబ్రరీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
● వర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, వర్సిటీ హాస్టల్స్ వార్డెన్‌గా తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎన్.నరసింహులును నియమించారు.
● సీడీసీ డీన్‌గా మాథ్స్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ పీవీ సుందరానంద్‌ను నియమితులయ్యారు. ఈయన ఇప్పటికే ఎగ్జామినేషన్స్ డీన్‌గా ఉన్నారు.
● సుమారు రెండు నెలలుగా ఖాళీగా ఉన్న రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు ప్రిన్సిపాల్‌ను నియమించాల్సి ఉంది.
● ఆర్‌యూసీఈకి వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు.

ఆర్‌యూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ కృష్ణా

ఆర్‌యూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ కృష్ణా