మహానందిలో వైభవంగా పదహారు రోజుల పండుగ | - | Sakshi
Sakshi News home page

మహానందిలో వైభవంగా పదహారు రోజుల పండుగ

Mar 14 2025 1:29 AM | Updated on Mar 14 2025 1:28 AM

మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మహానందిలో గురువారం పదహారు రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవికల ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంతుశర్మ, శాంతారాంభట్‌, అర్చకులు జనార్ధన్‌, మహేశ్వరయ్య ముందుగా యాగశాలలో అంకురాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల తొలిరోజు పుట్టమన్ను తెచ్చి పాలల్లో తడిపిన నవ ధాన్యాలతో చేసిన అంకురార్పణలో వచ్చిన మొలకలను రుద్రగుండం కోనేరులో శాసీ్త్రయంగా కలిపారు. ఈ ఏడాది మొలకలు బాగా వచ్చాయని, పంటలు బాగా పండుతాయని పండితులు చెప్పా రు. అనంతరం రథం వద్దకు చేరుకుని రథాంగ దేవతలను పూజించి వారిని స్వస్థానాలకు పంపి రథాన్ని రథమండపంలోకి చేర్చారు. దీంతో శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరుల కళ్యాణ, బ్రహ్మోత్సవ దీక్ష ముగిసిందని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహానంది, నంద్యాల ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య మహిళలు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి దంపతులకు వడిబియ్యం(చీర,సారె) సమర్పించి పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement