నేడు వాతావరణ మార్పులపై వర్క్‌షాపు | - | Sakshi
Sakshi News home page

నేడు వాతావరణ మార్పులపై వర్క్‌షాపు

Mar 11 2025 1:43 AM | Updated on Mar 11 2025 1:41 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): నాబార్డు ఆధ్వర్యంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 11న ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంటు జనరల్‌ మేనేజర్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వర్క్‌షాపునకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన నాన్‌ గవర్నమెంటు ఆర్గనైజేషన్‌లు(ఎన్‌జీవో), రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ఆర్‌ఏఆర్‌ఎస్‌, వీవీకే శాస్త్రవేత్తలు పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు, పంటల గురించి శాస్త్రవేత్తలు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పేరిట మోసం

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

కర్నూలు: హైదరాబాద్‌లో బిందు కన్సల్టెన్సీ పేరిట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అశ్విని, సాయికృష్ణ, హిమబిందు కలసి రూ.60 వేలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్‌కుమార్‌ రెడ్డి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్‌ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 122 ఫిర్యాదులు రాగా.. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని వినతులను స్వీకరించారు.

అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌(పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ సెల్‌)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదక(పీజీఆర్‌ఎస్‌)ను నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారం అయ్యాయా లేదా అనే అంశంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆడిట్‌ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు.

ప్రతి భక్తుడితో మర్యాదగా మెలగాలి

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల క్షేత్రానికి విచ్చేసే భక్తులందరితో మర్యాదగా మెలగాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. సోమవారం ఈ నెల 27 నుంచి 31వ తేది వరకు నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలపై దేవస్థాన వివిధ శాఖాధిపతులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారని, ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలలో ఆయా కై ంకర్యాలన్నీ సమయానుకూలంగా, పరిపూర్ణంగా చేపట్టాలన్నారు. నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర భక్తులకు తాగునీటి సదుపాయం, సేదతీరేందుకు షా మియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో 12లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

నేడు వాతావరణ మార్పులపై వర్క్‌షాపు  1
1/1

నేడు వాతావరణ మార్పులపై వర్క్‌షాపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement