కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన పరీక్షలకు 90 శాతం హాజరు నమోదైందని వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఉదయం సెషన్‌లో జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలకు 9,222 మందికి 8,325 మంది, మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన ఆరోసెమిస్టర్‌కు 859 మందికి 792 మంది, స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉదయం సెషన్‌లో 19 మందికి 18 మంది, బీఈడీ మూడో సెమిస్టర్‌కు 3,300 మంది విద్యార్థులకు 306 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. నంద్యాల పీఎస్‌సీ అండ్ కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 2, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2, సెయింట్ జోసప్స్ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల, అనంత డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు.