కర్నూలు (న్యూటౌన్): నగరంలోని అబ్బాస్‌నగర్ యూనిక్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జమియత్ ఉలమా అధ్యక్షులు మౌలానా డాక్టర్ ఖాజీ అబ్దుల్ మాజిద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ హజ్ కమిటీ, ప్రైవేట్ టూర్స్ హజ్‌కు వెళ్లే యాత్రికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ శిబిరంలో హజ్ యాత్రకు సంబంధించి పుస్తకాన్ని అందజేస్తామని, ఆ తర్వాత హజ్ యాత్రికులకు ఇఫ్తార్ విందు ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9032875378 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.