పెద్దాసుపత్రిలో నాణ్యమైన ల్యాబొరేటరీ సేవలు | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రిలో నాణ్యమైన ల్యాబొరేటరీ సేవలు

Published Mon, Dec 4 2023 1:48 AM

మాట్లాడుతున్న డాక్టర్‌ పద్మ విజయశ్రీ  - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన ల్యాబోరేటరీ సేవలు అందిస్తున్నామని బయోకెమిస్ట్రీ హెచ్‌వోడి డాక్టర్‌ పద్మ విజయశ్రీ చెప్పారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు మెడికల్‌ కాలేజీలో జోనల్‌ సీఎంఈ నిర్వహించారు. జోనల్‌ స్థాయిలో వివిధ కాలేజీల నుంచి బయోకెమిస్ట్రీ విభాగాల పీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ పద్మవిజయశ్రీ మాట్లాడుతూ కర్నూలు మెడికల్‌ కాలేజీలోని అన్ని విభాగాల్లో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాణ్యమైన, కచ్చితమైన నివేదికలు రోగులకు ఇస్తున్నట్లు తెలిపారు. నిపుణులైన వైద్యులతో పాటు టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ నుంచి డాక్టర్‌ శివప్రబోద్‌, మంగళగిరి ఎయిమ్స్‌ నుంచి డాక్టర్‌ నిచ్చెనమెట్ల గౌతమ్‌, హైదరాబాద్‌లోని నిమ్స్‌ నుంచి డాక్టర్‌ ఎం. విజయభాస్కర్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ నుంచి డాక్టర్‌ సి. గాయత్రి ప్రసంగించారు. కార్యక్రమానికి పరిశీలకులుగా అనాటమీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి. శోభాదేవి, కాలేజ్‌ కో ఆర్డినేటర్‌గా వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌ వ్యవహరించారు.

ప్రశాంతంగా

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

కర్నూలు సిటీ: నేషనల్‌ కమ్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌)పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన మొత్తం 17 కేంద్రాలలో 3,999 మంది విద్యార్థులకుగాను 3,773 మంది హాజరయ్యారు. 226 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కర్నూలు బీక్యాంపు స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఈఓ డా.వి రంగారెడ్డి తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement