బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పరిధిలోని సబ్ డివిజన్‌లలో మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన 86 వాహనాలను ఆయా డివిజన్‌లకు చెందిన డీఎస్పీల ఆధ్వర్యంలో శనివారం వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో 9 బైక్‌లు, 5 ఆటోలు, 1 కారును జిల్లా పోలీసు కార్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో, ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లో 2 బైక్‌లు, 1 ఆటోను ఆళ్లగడ్డ రూరల్ పోలీస్టేషన్‌లో, డోన్ సబ్ డివిజన్‌లో 8 బైక్‌లు, 3 ఆటోలు, 2 కార్లు బనగానపల్లె పోలీస్టేషన్‌లో, ఆత్మకూరు సబ్ డివిజన్‌లో 52 బైక్‌లు, 2 ఆటోలు, 1 కారును ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో వేలం వేస్తున్నామన్నారు. అదే విధంగా నందికొట్కూరు సర్కిల్‌కు సంబంధించిన వాహనాలు ఈ నెల 4వ తేదీన బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్‌లో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.