
స్టేషన్ మేనేజర్ వెంకటాద్రి దొరస్వామిని సన్మానిస్తున్న రైల్వే సిబ్బంది
నంద్యాల(రూరల్): నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజర్‌గా వెంకటాద్రి దొరస్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న షేక్ అబ్దుల్‌వహాబ్ పదవీ విరమణ పొందడంతో, మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ మేనేజర్‌గా పని చేస్తున్న దొరస్వామిని రైల్వే ఉన్నతాధికారులు ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన దొరస్వామిని రైల్వే సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్, సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామన్నారు.