సిద్దమల్ల(ఫైల్)
హొళగుంద: రోడ్డు ప్రమాదంలో హొళగుందకు చెందిన బోయ కేస్వీ సిద్దమల్ల (43) మృతి చెందినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. పనినిమిత్తం శుక్రవారం మోటార్‌సైకిల్‌పై ఆదోని మార్కెట్ యార్డ్‌కు రాత్రి హొళగుందకు తిరిగి వస్తున్నాడు. లింగంపల్లికి చెందిన మొలగవల్లి చాకలి ఖాసీం అనే వ్యక్తి బైక్‌పై హెబ్బటం వైపు వెళ్తున్నాడు. హెబ్బటం–లింగంపల్లి మధ్యలో చింత చెట్టు వద్ద వీరిద్దరి మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సిద్దమల్ల తీవ్రంగా గాయపడడంతో 108లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బళ్లారికి తరలించగా అక్కడ కోలుకో లేక శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య హంపమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాకలి ఖాసీంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.


