న్యూస్‌రీల్
మత్స్యకారుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం బ్రేక్ వాటర్ పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయని వైనం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 67 శాతం పనులు పూర్తి మళ్లీ వైఎస్సార్ సీపీ గెలిచుంటే హార్బర్ పూర్తయ్యేదంటున్న మత్స్యకారులు పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం తమ కడుపు కొట్టిందని ఆగ్రహం
నామమాత్రంగా పనులు
హార్బర్‌తో మత్స్యకారులకు మేలు
రెండేళ్లుగా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులు నత్తనడక
పులిచింతల సమాచారం
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నిలిచిన మట్టితవ్వకం పనులు
7
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిగా ఎం.ధనలక్ష్మిని నియమిస్తూ పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ డీపీఓగా జెడ్పీ సీఈఓ జె.అరుణ వ్యవహరిస్తున్నారు.
ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ రామ సుబ్రమణియన్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు.
క్రమశిక్షణ చర్యలు పునఃపరిశీలించాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఐవీఆర్‌ఎస్ నివేదికల ఆధారంగా స్వర్ణ గ్రామ/వార్డు సచివా లయ ఉద్యోగులపై క్రమశిక్షణ పేరుతో హెచ్చరికలు, మెమోలు, సస్పెన్షన్ వంటి చర్యలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, వాటిని పునఃపరిశీలించాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ ఆటోనగర్‌లోని ఎస్‌జీఎస్‌డబ్ల్యూ శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అర్లయ్య మాట్లాడుతూ.. ఐవీఆర్‌ఎస్ నివేదికల ఆధారంగా జారీ చేసిన మెమోలు, సస్పెన్షన్ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. సంస్థ కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యులు బడుగు సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: పట్టణంలో వేంచేసిన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ముఖ మండపంలో స్వామికి బుధవారం అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాక్షి, ప్రతినిధి విజయవాడ: మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గిలకదిండి ఫిషింగ్ హార్బర్‌కు రెండేళ్లుగా ‘చంద్ర’ గహణం పట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 67 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు పాల నలో నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లలో కేవలం ఐదు శాతం లోపు పనులే జరిగాయి. 2024లో మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే హార్బర్ పనులు ఈ పాటికే పూర్తయ్యేవని పలువురు మత్స్యకారులు పేర్కొంటున్నారు. హార్బర్‌లో మిగిలిన 30 శాతం పూర్తి చేయకుండా తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం అడు తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చూస్తున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదన్న భావన మత్స్యకారుల్లో ఉంది.
వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను వేగవంతం చేసింది. ఇక్కడ పాతికేళ్ల క్రితం నిర్మించిన హార్బర్ ఉపయోగంలో లేదు. హార్బర్ ఇసుక మేటలు వేసి పూడిపోవడంతో సముద్రంలోకి బోట్లు వెళ్లే వీలు లేకుండాపోయింది. ఫలితంగా మత్స్యకారులు పోటు సమయంలోనే అతికష్టంమీద వేటకు వెళ్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఇతర జిల్లాలోని హార్బర్లపైన ఆధారపడి వేట చేయాల్సి వచ్చేది. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతూ గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిలకలదిండి హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరో 50 ఏళ్ల వరకు మత్స్యకారుల వేటకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక వసతులతో ఫిషింగ్ హార్బర్ పనులను రూ.421.71 కోట్లతో చేపట్టి మార్చి 2021లో ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్‌ను 550 బోట్లు నిలిపే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే 3,300 మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఫిష్ ల్యాండింగ్ కెపాసిటీ 23,500 టన్నులుగా నిర్ణయించారు. ప్రధానంగా 764 మీటర్ల క్వే (గట్టు )కు సంబంధించి 95 శాతం పనులు పూర్తయ్యాయి. 21.55 లక్షల క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ (మట్టి పనులు) చేయాల్సి ఉండగా 18.28 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. మౌలిక వసతులకు సంబంధించిన పనులు ప్రారంభయ్యాయి. బ్రేక్ వాటర్ పనులకు సంబంధించి రాక్ సరఫరాతో, ప్లేస్‌మెంట్ సైతం పూర్తయ్యాయి. సీసీ స్లాబ్, క్రో వాల్ పెండింగ్‌లో ఉన్నాయి.
అసంపూర్తిగా మౌలిక వసతులు
చేపల అమ్మకం షెడ్లు, లోడింగ్ సదుపాయాలు, పరిపాలన భవనం, మత్స్యకారుల విశ్రాంతి భవనాలు, డార్మెటరీలు, రేడియో కమ్యూనికేషన్ టవర్, కోస్టల్ పోలీసు స్టేషన్, అంతర్గత రోడ్లు, కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ప్లాంట్‌లు, రక్షిత మంచినీటి ట్యాంకు, డ్రెయినేజీ ఇలా పలు మౌలిక వసతులకు సంబంధించిన భవనాల నిర్మాణం కొన్ని అసంపూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని ప్రారంభమే కాలేదు. హార్బర్ పనులు నత్తనడకన సాగడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండెనక బండి కట్టి..
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 33.9320 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
గత ప్రభుత్వంలో ప్రారంభమైన హార్బర్ పనులు నామమాత్రంగానే సాగుతున్నాయి. గతంలో వేగంగా జరిగేవి. రెండేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. వేటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మత్స్యకారులు ముఖద్వారం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. ఏ సమయంలోనైనా వేటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి.
– లంకే వెంకటేశ్వరరావు, మైకనైజ్డ్ బోట్స్
అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
మచిలీపట్నం హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఏ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైనా కానీ అన్ని సదుపాయాలతో హార్బర్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం పనులు నిలిచిపోకుండా త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలి.
– సైకం ఆంజనేయులు, డీప్ సీ ఫైబర్
బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇసుక మేటలను నివారించి సముద్రంలోకి పడవలు వెళ్లటానికి వీలుగా సముద్ర మొగకు కృష్ణా నది దక్షిణం వైపు 1,240 మీటర్లు, తూర్పు వైపు 1,150 మీటర్ల వరకు గోడలు నిర్మించాల్సింది. దీంతో పాటు 14 మీటర్ల లోతున 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సింది. ఈ పనులు పూర్తిగా నిలిచిపో యాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలోనే హార్బర్ నిర్మాణానికి అవసరమైన 56 ఎకరాల భూమిని సేకరించి కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. చంద్రబాబు సర్కారు వచ్చాక పనులు పూర్తిగా పడకేశాయి.


