గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరాపై కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, పట్టా భూముల్లో ఇసుక తొలగింపు, కొత్త రీచ్‌లకు అనుమతులు, అక్రమ రవాణా నివారణ చర్యలపై చర్చించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచి కచర్ల మండలాల్లో రీచ్‌లకు సంబంధించిన టెండర్లు ఖరారు కాలేదని, తిరిగి టెండర్లు పిలిచే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు రైతులకు అనుమతి ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మైన్స్ డీడీ శ్రీనివాస్ కుమార్, ఏడీ కె. వీరస్వామి, డీపీఓ లావణ్యకుమారి, డీటీసీ ఎం. పురేంద్ర, కేసీ డివిజన్ ఈఈ రవికాంత్, నందిగామ ఆర్డీఓ కె.పోసిబాబు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, పరీక్షల సమన్వయకర్త మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే మూడో తేదీన జరిగే పరీక్షకు కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు కేంద్రాల్లో 480 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. 64 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం, తేదీ లేదా షిఫ్ట్ మార్పులపై ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాల విద్యార్థులకు పవర్ లిఫ్టింగ్ పోటీలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. సిద్ధార్థ కళాశాల ఆధ్వరంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎనిమిది కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. బహు మతి ప్రదానోత్సవానికి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ హాజరై ప్రసంగించారు. జూన్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు చెన్నయ్ లోని హిందుస్థాన్ యూనివర్సిటీ ఆవరణలో అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టిగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీ జట్టుకు ఎంపికై న సభ్యులు ప్రతిభ చూపాలన్నారు. కృష్ణా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమచంద్రరావు, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డాక్టర్ టి.వి.బి.కృష్ణారెడ్డి పోటీల విజేతలను అభినందించారు. వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ దేవినేని అవినాష్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సోషల్ మీడి యాలో ప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు తమ పార్టీ మైనార్టీ నాయకుడు కరిముల్లాపై టీడీపీ నాయకులు దాడి చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కుని తెలిపారు. ఆ హక్కును అణచివేయడానికి కూటమి ప్రభుత్వం హింసాత్మక మార్గాలకు తెగబడుతోందని దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం తప్పుకాదని, ఆ గొంతు లను టీడీపీ నేతలు భయపెట్టడం అసహ్యమని పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరిముల్లాకు తగిన రక్షణ కల్పించి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


