బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబూజగ్జీవన్‌రామ్‌ అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్నారు. భారత ఉపప్రధాని బాబూజగ్జీవన్‌రామ్‌ జయంతిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్న జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి జగ్గీజవన్‌రామ్‌ కృషి మరువలేనిదన్నారు. విద్యార్థి దశ నుంచే అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను పటాపంచలు చేసిన మహోన్న తుడని పేర్కొన్నారు. క్విట్‌ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమాల్లో సైతం మహాత్మగాంధీతో కలిసి అడుగులు వేసి ముందుకు సాగారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement