దుర్గమ్మకు పలువురి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు పలువురి విరాళాలు

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

దుర్గమ్మకు పలువురి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. పెనమలూరు మండలం పోరంకికి చెందిన పి.ప్రదీప్‌, శార్వాణి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి లక్ష్మీలీల పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం అందజేశారు. విజయవాడ సిద్ధార్థనగర్‌కు చెందిన జెమిని శ్రీనివాస్‌ నవీన్‌ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.08 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. బందరు సర్కారుతోటలో చోరీ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయపడ్డారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తోట్లవల్లూకు చెందిన భుక్యా లాలూప్రసాద్‌నాయక్‌ తన పెళ్లి సంబంధం గురించి తాత బాణావత్‌ దుర్గారావుతో కలిసి జగ్గయ్యపేటకు వెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా యనమలకుదురు కరకట్ట రోడ్డుపై ఎదురుగా ముగ్గురు బైక్‌పై అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో దుర్గారావు తీవ్రగాయాలవడంతో పోరంకిలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. మరో బైక్‌పై ఉన్న ముగ్గురికి కూడా గాయపడ్డారు. వారు విజయవాడ ఆస్పత్రిలో చేశారు. లాలూప్రసాద్‌నాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మచిలీపట్నంలోని సర్కారుతోటలో చోరీ జరిగింది. పోలీ సులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలపూడి పోలీసుల కథనం మేరకు.. సర్కారుతోటకు చెందిన మోతుకూరి లలిత మచిలీపట్నం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆప రేటర్‌గా పనిచేస్తున్నారు. లలిత తన తల్లితో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్లారు. ఆదివారం ఉదయం పక్కింటి వారు లలితకు ఫోన్‌ చేసి వారి ఇంటి తలు పులు తెరచి ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన మచిలీపట్నంలోని ఇంటికి చేరుకున్నారు. బీరువా తలుపులు తెరచి ఉండటంతో పాటు, రూ.20 వేల నగదు, గాజులు, ఉంగరం, రూపులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన లలిత చిలకలపూడి పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్‌ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి (30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్‌ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్‌ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్‌ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థాని కులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement