వృద్ధుడిని హత్య చేసిన ఆగంతకులు | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడిని హత్య చేసిన ఆగంతకులు

Mar 30 2026 12:49 PM | Updated on Mar 30 2026 12:49 PM

వృద్ధుడిని హత్య చేసిన ఆగంతకులు

నందిగామ టౌన్‌: ఇంటి వరండాలో నిద్రించిన వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చింతలపాడు గ్రామానికి చెందిన రెబ్బగొండ్ల వెంకటపతి (85) ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని భార్య గతంలోనే మరణించారు. ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి తన నివాసంలోని వరండాలో వెంకటపతి నిద్రించాడు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి ముఖంపై కొడవలితో దాడి చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధర్మరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement