మంగినపూడి బీచ్ పరిశీలన
కోనేరుసెంటర్: మోంథా తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితులను గమనించారు. మోంథా తుపాను నేపథ్యంలో తీరప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం గిరిపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. జిల్లాలో రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. చెట్లు, గోడలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మంత్రి వెంట ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం డివిజన్ తుపాను ప్రత్యేకాధికారి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.


