ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

Oct 14 2025 6:49 AM | Updated on Oct 14 2025 6:49 AM

ఎకై ్

ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ

ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ నాయకులు ● మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జోరు వాన పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా కార్యాలయం వద్ద ప్లకార్డులతో నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జి.గంగాధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, మహిళా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ● పామర్రు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కై లే అనిల్‌కుమార్‌ నేతృత్వంలో మొవ్వ ఎకై ్సజ్‌ సీఐ కార్యాలయానికి భారీగా ర్యాలీగా తరలివెళ్లి నిరసన ప్రదర్శన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయ కులు దాసరి అశోక్‌కుమార్‌, గోగం సురేష్‌, రాజులపాటి రాఘవరావు, రాజులపాటి పార్వతి, జొన్నల రామ్మోహన్‌రెడ్డి, ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, నడకుదుటి రాజేంద్ర, బోళ్ల సోమేశ్వరరావు, సజ్జా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ● పెడన నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పెడన పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్‌ కె.అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్‌, మైలా రత్నకుమారి, ఎంపీపీలు సంగా మధుసూదనరావు, రాజులపాటి కళ్యాణి, కారుమంచి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ● పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో ఉయ్యూరులోని ఎకై ్సజ్‌ సీఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్ద కల్తీ మద్యానికి సంబంధించి కారకులను అదుపులోకి తీసుకుని శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి రామినేని రమాదేవి, ప్రచార కార్యదర్శి ప్రతివాడ రాఘవరావు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సింహాద్రి రమేష్‌ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎకై ్సజ్‌ సీఐ కార్యాలయం వద్ద నినాదాలు చేసి అనంతరం సీఐ గిరిజాకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మీనారాయణ, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి గాజుల జయగోపాల్‌, మండల కన్వీనర్‌ రేపల్లె శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నకిలీ మద్యాన్ని అరికట్టి, బెల్ట్‌షాపులను తొలగించాలని డిమాండ్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ధ్వజమెత్తిన మహిళలు జోరువానలో నినాదాలతో హోరెత్తిన ఎకై ్సజ్‌ కార్యాలయాలు

చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వ హయాంలో జోరుగా సాగుతున్న నకిలీ మద్యం తయారీపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. గ్రామాల్లో వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటు, నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనలతో పాటు నినాదాలతో హోరెత్తించారు. నకిలీ, కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొ ద్దని కూటమి ప్రభుత్వంపై మహిళలు తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారు చేసి నేరుగా హోటళ్లు, దాబాలు, బెల్టుషాపులు, రోడ్ల పక్కన బడ్డీకొట్లలో సైతం విక్ర యాలు చేపట్టడం దారుణమన్నారు. నకిలీ మద్యం తయారీని ఒక కుటీర పరిశ్రమగా తయారుచేసి ప్రోత్సహిస్తున్నారని, కల్తీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. నకిలీ మద్యం ద్వారా కూటమి నాయకులు రూ.కోట్లు గడిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, చాలా మంది అనారోగ్యం పాలయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా నకిలీ మద్యం తయారీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, మహిళల తాళిబొట్లు తెంచొద్దని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచనలతో ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ1
1/1

ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement