ముగిసిన జగన్నాథ రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జగన్నాథ రథయాత్ర

Jun 30 2025 7:34 AM | Updated on Jun 30 2025 7:46 AM

ముగిస

ముగిసిన జగన్నాథ రథయాత్ర

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇస్కాన్‌ ఆధ్వర్యంలో కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పూరిలో జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర తరహాలో ఇక్కడ విజయవాడ ఇస్కాన్‌ మందిరం అధ్యక్షుడు శ్రీమాన్‌ చక్రధారి దాసు నేతృత్వంలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు నిర్వహించడంపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం నిర్వహించారు. పూలతో అలంకరించిన ఎడ్లబండిలో శ్రీసుభద్ర మహారాణి వేంచేసి ఉండగా.. సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైన శోభా యాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వరకు సాగింది. ఇందులో భాగంగా మహిళలు జగన్నాఽథ, బలభద్ర – సుభద్రల మూర్తులకు సారె సమర్పించారు.

ఆలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ఉత్సవాల్లో భాగంగా భరత నాట్య కళాకారులు శ్రీజ, డాక్టర్‌ గౌతమి, సత్యవతి చక్రవర్తి ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అలరించాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్‌ భక్త బృందం, రాక్‌ బాండ్‌ గానం చేసిన హరినామ సంకీర్తనలు ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తాయి. అలాగే మహిళల కోలాటం, పురుషుల విలువిద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అలంకరించిన ఎడ్లబండిపై శోభాయాత్ర

మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు

సీతానగరం వద్ద సారె సమర్పణకు వస్తున్న మహిళలు

లోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం

భక్తజనం సారె సమర్పణ

ముగిసిన జగన్నాథ రథయాత్ర 1
1/2

ముగిసిన జగన్నాథ రథయాత్ర

ముగిసిన జగన్నాథ రథయాత్ర 2
2/2

ముగిసిన జగన్నాథ రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement