కీళ్లు కిర్రు కిర్రు | - | Sakshi
Sakshi News home page

కీళ్లు కిర్రు కిర్రు

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

కీళ్ల

కీళ్లు కిర్రు కిర్రు

లబ్బీపేట(విజయవాడతూర్పు): కీళ్ల సమస్యలు అధికమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో, ప్రైవేటు ఆస్పత్రిల్లో ఆర్ధోపెడిక్‌ వైద్యుల వద్దకు కీళ్ల సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరికి కీళ్ల అరుగుదల సమస్య ఎదురవుతోంది. ఇలాంటి వారిలో 35 ఏళ్లు వయస్సు వారు కూడా ఉండటం గమనార్హం. 40 ఏళ్లకే కీళ్ల మార్చిడి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఒకప్పుడు ఒబెసిటీ ఉన్న వారిలో, వృద్ధాప్యంలో కీళ్లు అరిగిన వారు ఉండేవారు. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఆర్థరైటిస్‌ కారణంగా కీళ్లు అరిగిపోతున్నాయి. కీళ్లు పూర్తిగా అరిగి నడవలేని స్థితికి చేరుకున్న వారికి కీళ్ల మార్పిడే మార్గంగా ఉంటోంది.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌

ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. ఇది ఎందుకు సోకుతుందో కచ్చితంగా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ సోకిన వారిలో కీళ్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉంటాయి. సకాలంలో చికిత్స చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తే కీళ్లు అరుగుదలతో పాటు చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, నరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, ఊపిరితిత్తుల చుట్టూ వాపు ఏర్పడవచ్చు. ప్రస్తుతం రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు మంచి వైద్యం అందుబాటులోఉంది. క్రమం తప్పకుండా మందులు వాడి అదుపులో ఉంచుకోవచ్చు.

ఆస్టియో ఆర్థరైటిస్‌

దీన్ని గుల్ల ఎముక (ఆస్టియో ఆర్థరైటిస్‌) వ్యాధి అని కూడా అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు గుల్లబారుతుంటాయి. ఆ ప్రభావంతో చిన్న దెబ్బకే విరుగుతుంటాయి. మోకీళ్లు, తుంటెకీళ్లు అరుగుదల ఏర్పడుతుంది. అలాంటి వారికి కీళ్లమార్పిడి చేయాల్సి వస్తుంది. వెన్నుముక వంకర ఏర్పడటంతో నిటారుగా నడవలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మధ్య వయస్సు వారు కూడా ఆస్టియో ఆర్థరైటిస్‌ బారిన పడుతున్నారు.

చిన్న వయస్సులోనే ఆర్థరైటిస్‌ అరుగుతున్న కీళ్లు వ్యాయామంతో అదుపులో.. జిల్లాలో 50 వేల వరకూ ఆర్థరైటిస్‌ రోగులు

ఇలాంటి వారికి రావచ్చు

థైరాయిడ్‌ ఉన్న వారికి, అబార్షన్స్‌ అయిన మహిళలకు ఆర్థరైటిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16 నుంచి 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌ ఎక్కువగా తీసుకుంటే అందుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా ఏ రకమైనది సోకిందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది.

కీళ్లు కిర్రు కిర్రు1
1/1

కీళ్లు కిర్రు కిర్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement