
ప్రజల కోసమే పోలీసులు
కోనేరుసెంటర్: ప్రజల కోసమే పోలీసు వ్యవస్థ పని చేస్తోందని ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేరుగా తమను కలిసి న్యాయం పొందవచ్చని కృష్ణా ఎస్పీ ఆర్‌గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసమన్నారు. సమస్యల పరిష్కారంలో సిబ్బందిపై ఎలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను ఫోన్లలో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన మీకోసంలో 38 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు.
ఎస్పీ గంగాధరరావు