
‘ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షునిగా విద్యాసాగర్‌ను ఎన్నుకు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సేవలందిస్తున్న ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపర్తి విద్యాసాగర్ రాష్ట్ర అధ్యక్షుడిగా అభ్యర్థిత్వానికి ఎన్టీఆర్ జిల్లా పూర్తి మద్దతు తెలియజేస్తూ జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానం చేసినట్లు జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. గాంధీనగర్‌లోని ఎన్జీఓ హోంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో కార్యవర్గ సమావేశం సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుడని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాట పటిమ కలిగిన విద్యాసాగర్‌కు ఆ పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షుడు వీవీ ప్రసాద్, జిల్లా కార్యదర్శి పి.రమేష్‌లు మాట్లాడుతూ రాష్ట్ర సంఘానికి అధ్యక్ష బాధ్యతలు సంకల్పబలం కలిగిన విద్యాసాగర్‌కు అప్పగించాలని కోరుతున్నామన్నారు. అధ్యక్ష పదవికి విద్యాసాగర్ పేరును బలపరస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సతీష్‌కుమార్, జి.రామకృష్ణ, ఎం.రాజుబాబు, సీహెచ్ దిలీప్‌కుమార్, బి.నాగేంద్రరావు, డి.విశ్వనాథ్, కె.శివలీల, నగర శాఖ అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, కార్యదర్శి నజీరుద్దీన్, జిల్లాకు చెందిన తాలూకా యూనిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో కార్యవర్గ
సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం