
ఆర్టీసీ డ్రైవరు, కండక్టరుపై దాడి
బంటుమిల్లి: గుడివాడ ఆర్‌టీసీ బస్సు డ్రైవరు, కండక్టరుపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో ప్రయాణికులు, డ్రైవరు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ రోజు డ్రైవరు మద్దా నాగరాజుతో గొడవపడ్డ బంటుమిల్లికి చెందిన సోమిశెట్టి వెంకటనారాయణ తన స్నేహితులు దాసు శ్రీనివాసరావు, రాఘవరపు సతీష్‌లతో కలసి స్థానిక ఆంధ్రబ్యాంకు సెంటర్లో బస్సును అడ్డుకుని డ్రైవరు నాగరాజుపై దాడి చేశారు. ఈ గొడవను వీడియో తీస్తున్న కండక్టరు పర్వతనేని శ్రీదేవీని కూడా అసభ్యంగా బూతులు తిట్టి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సెంటర్లో ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించింది. ఎస్‌ఐ గణేష్‌కుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. పెడన మండలం, ఉరిమి గ్రామానికి చెందిన డ్రైవరు మద్దా నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటనారాయణ, శ్రీనివాసరావు, సతీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.