కృష్ణా జిల్లాలో ఆస్తి పన్నులు ఇలా..
2024–25 ఏడాదికి సంబంధించి కృష్ణా జిల్లా లోని తాడిగడప పురపాలక సంఘంలో 48,006 అసెస్‌మెంట్ల ద్వారా రూ.27.12 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రూ.23.82 కోట్లు వసూలయ్యాయి. 87.82 శాతం పన్నుల వసూలుతో ఈ మునిసిపాలిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 7,874 అసెస్‌మెంట్ల ద్వారా పెడన మునిసిపాలిటీకి రూ.2.19 కోట్ల పన్నులు వసూలు కావాల్సిఉంది. రూ.1.50 కోట్లు వసూలు చేసి 68.45 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మచిలీపట్నం కార్పొరేషన్‌లో 52,570 అసెస్‌మెంట్ల ద్వారా రూ.33.02 కోట్ల పన్నులకు రూ.15.14 కోట్లు మాత్రమే వసూలు చేసి 45.86 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. గుడివాడ పురపాలక సంఘం 29,384 అసెస్ మెంట్ల ద్వారా రూ.18.05 కోట్ల పన్నులకు రూ.10.99 కోట్లు వసూలు చేసి 59.43 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఉయ్యూరు 10,591 అసెస్‌మెంట్లకు రూ.6.17 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. రూ.4.18 కోట్లు వసూలు చేసి 67.68 శాతం నమోదుతో మూడో స్థానంలో నిలిచింది.


