15 నుంచి పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ | Sakshi
Sakshi News home page

15 నుంచి పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌

Published Tue, Nov 28 2023 1:44 AM

జెర్సీలను ఆవిష్కరిస్తున్న సాయిబాబు, వెంకటరావు, జట్టు సభ్యులు   - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సిటీ కేబుల్‌ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా డిసెంబర్‌ 15 , 16, 17 తేదీల్లో పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు సిటీ కేబుల్‌ ఎండి పొట్లూరి సాయిబాబు చెప్పారు. ప్రజాశక్తినగర్‌లోని సిటీ కేబుల్‌ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సిటీకేబుల్‌ ఎండీ పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు డిస్ట్రిబ్యూషన్‌ ఏపీ స్టేట్‌ హెడ్‌ పి.వెంకటరావు టీమ్‌ జెర్సీలను విడుదల చేశారు. సాయిబాబు మాట్లాడుతూ యనమలకుదురులోని కేకే గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతుందన్నారు. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని చెప్పారు. వివిధ ఉద్యోగాల్లో ఉన్న వారు విధుల్లో ఒత్తిడికి గురవ్వుతుంటారని వారిలో ఉత్సాహాన్ని నింపేలా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. సిటీకేబుల్‌, పోలీస్‌, రెవెన్యూ, డాక్టర్స్‌, లాయర్స్‌, ప్రింట్‌అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, లోకల్‌ ఛానల్స్‌ మొత్తం ఎనిమిది టీమ్‌లు ఈ టోర్నిలో పాల్గొంటాయని వివరించారు. టోర్నమెంట్‌ విజేతకు రూ.30 వేల క్యాష్‌ ప్రైజ్‌, రన్నరప్‌ రూ.20 వేల క్యాష్‌ ప్రైజ్‌ అందిస్తామని చెప్పారు. సిటీకేబుల్‌ అనుబంధ సంస్థ జీ టీవీ ఈ టోర్నమెంట్‌ను స్పాన్సర్‌ చేస్తుందని వెల్లడించారు. జనవరి 28 తేదీన పొట్లూరి రామకష్ణ జయంతి రోజున విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. జీ తెలుగు డిస్ట్రిబ్యూషన్‌ ఏపీ స్టేట్‌ హెడ్‌ పి.వెంకటరావు మాట్లాడుతూ ఈ టోర్ని నాక్‌ అవుట్‌ మ్యాచులేనని వివరించారు. 15 వ తేదీన మొదటి మ్యాచ్‌ ప్రింట్‌ –ఎలక్ట్రానిక్‌ మీడియా జట్ల మధ్య, రెండో మ్యాచ్‌ సిటీకేబుల్‌ – డాక్టర్స్‌ జట్ల మధ్య, 16 వ తేదీన మూడో మ్యాచ్‌ పోలీస్‌ – లోకల్‌ చానెల్స్‌ జట్ల మధ్య, నాలుగో మ్యాచ్‌ రెవిన్యూ–లాయర్స్‌ జట్ల మధ్య ఉంటుందని చెప్పారు. 17వ తేదీన మొదటి మ్యాచ్‌ విజేత – నాలుగో మ్యాచ్‌ విజేతల మధ్య, రెండు మూడు మ్యాచ్‌ విజేతల మధ్య పోటీ జరుగుతుందన్నారు. వీటిలో విజేతలు ఫైనల్స్‌లో ఆడతారని వివరించారు.

 
Advertisement
 
Advertisement