‘ప్రాణహిత’ పూర్తికాకపోవడం దురదృష్టకరం | - | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత’ పూర్తికాకపోవడం దురదృష్టకరం

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ● తుమ్మిడిహెట్టి వద్ద నది పరిశీలన

కౌటాల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టు ఆ తర్వాత పలువురు సీఎంలు మారినా పూర్తికాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించి.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడటం మానుకుని, రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు నీరందక ఈ ప్రాంత రైతులు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత మనోహర్‌, మండల ఇన్‌చార్జి అనిల్‌ పాల్గొన్నారు.

ఎస్పీఎంలో స్థానికులకే అవకాశం కల్పించాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత అన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాగజ్‌నగర్‌ పట్టణానికి చేరుకోగా, చెక్‌పోస్ట్‌ వద్ద సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత పుష్పగుచ్ఛం, హారతితో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పట్టణంలోని ఎస్పీఎం కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మిల్లులో స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి మిగితా 5 శాతం ఇతర ప్రాంతాల వారికి ఇవ్వాలన్నారు. యాజమాన్యం హైకోర్టులో పెట్టిన కేసును వెనక్కి తీసుకుని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మాజీ మంత్రి బోడ జనార్దన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కార్మిక గుర్తిపుం సంఘం ఎన్నికలు నిర్వహించేలా హైకోర్టులో న్యాయవాదిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కావేటి మనోహర్‌, శ్రీనివాస్‌, హెచ్‌ఎంఎస్‌ నాయకులు, ఎస్పీఎం కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement