తానూరు: ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసి వాటిని తాగడం ఎంతో మేలని మహిళా అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని బోంద్రట్ గ్రామంలో సాయిబాబా మహిళ సంఘం సభ్యురాలు సిందే అర్చన–సాయినాథ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను గురువారం పరిశీలించారు. వర్షపు నీరు భూమిపై పడకముందే సేకరించి వాటిని నిల్వచేసి అదేనీటిని ఏడాదంతా తాగుతున్నట్లు వివరించారు. దీంతో తమకు ఎలాంటి వ్యాధులు రావడం లేదని తెలిపారు. వర్షపు నీరు స్వచ్ఛంగా ఉండి అరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్చన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్, సీసీ సవిత, గ్రామ సంఘం అధ్యక్షురాలు ప్రతిభ, వీవోఏ రాణి పాల్గొన్నారు.


