లోకేశ్వరం: మండలంలోని రాయపూర్‌కాండ్లీలో రైతు బక్కనోల్ల రాజుకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు మూడురోజుల క్రితం మొక్కజొన్న పంటను కోసి చేనులోనే ఉంచాడు. గురువారం పంటచేను పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో మంటలు చెలరేగి అర ఎకరంలో పంట దగ్ధమైంది. పంట విలువ రూ.30 వేల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. లూజు వైర్ల విషయమై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పంట దగ్ధమైందని రైతు ఆరోపిస్తున్నాడు.


