కాసిపేట: మండల కేంద్రంలోని ముత్యంపల్లి గ్రామశివారులో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టగా గుప్త నిధుల వేటకే తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి జేసీబీతో పురాతన శిల్పం ఉన్న రాయి పక్కన తవ్వకాలు చేపట్టినట్లు, గతంలో సైతం ఇక్కడ పలుమార్లు రాత్రి సమయంలో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనుగొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు ఎటువంటి సమాచారం లేదని తెలపగా, జేసీబీతో రాత్రి సమయంలో గోతి తవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


