ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన
సిర్పూర్(టి): మండలంలోని దుబ్బగూడ, టోంకిని, పారిగాం గ్రామాల్లో ఐకేపీ ఇందిరా క్రాంతి పథ కం కింద నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం నరసింహారెడ్డి, తహసీల్దార్లు రహీమొద్దీన్, ప్రమోద్‌కుమార్, ఏపీఎం చంద్రయ్య, డీటీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్(సిర్పూర్): మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ తిరుపతి తదితరులు ఉన్నారు.


