వామ్మో కొండచిలువ..!
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఈఎస్‌ఐ సమీపంలోని ఎస్పీఎం కాలనీలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. క్వార్టర్స్ ప్రాంతాల్లో గురువారం కొండచిలువ కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఎస్పీఎం క్వార్టర్స్‌లోని సె క్యూరిటీ సిబ్బందికి తెలపగా, వారు పాము ను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. కొండచిలువను పట్టణానికి దూరంగా అటవీ ప్రాంతానికి తరలించారు. ఎస్పీఎం క్వార్టర్స్ ఖాళీగా ఉండి పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో ఉండడంతో విషసర్పాలు తిరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.


