నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయమే గెలిచింది
ఆసిఫాబాద్‌అర్బన్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులను కోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో న్యాయమే గెలిచిందని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ రాజకీయ కక్షతో ఈడీని వాడుకున్న వారికి ఇదో గుణపాఠమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


