ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రభుత్వ విద్యాసంస్థల్లో నా ణ్యమైన విద్య అందుతుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలో గోయెగాం ప్రాథమిక పాఠశాల, వాంకిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. పాఠశాలల్లో పిల్లల హాజరు, ప్రీప్రైమరీ విభాగం, బోధన ప్రమాణాలు, పరిసరాలు, మధ్యాహ్న భోజ నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక ప్రకారం బోధించాలన్నారు. ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న్య, ఎంఈవో శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.


