నవోదయలో యూత్ గ్రామ సభ
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం కేంద్ర విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆదేశాల మేరకు మోడల్ యూత్ గ్రామసభ నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులు, గ్రామస్తుల పాత్రలు పోషించారు. ఆరోగ్యం, కూరగాయల పెంపకం, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంపు, హెల్త్ క్యాంప్, మహిళల స్వయం ఉపాధి, వ్యవసాయ పంటలకు మద్దతు ధర తదితర అంశాలపై 45 నిమిషాలపాటు చర్చించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రామయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కోసిని మాజీ సర్పంచ్ నగునూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు హరీబాబు, శ్రీఅంకిత్ పాల్గొన్నారు.


