నేటి నుంచి నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నామినేషన్లు

Nov 27 2025 1:13 PM | Updated on Nov 27 2025 1:13 PM

నేటి

నేటి నుంచి నామినేషన్లు

నేటి నుంచి నామినేషన్లు ● కెరమెరి మండల కేంద్రంలోని ఎంపిడీవో కార్యాలయంలో బుధవారం నామినేషన్‌ పత్రాలు, అభ్యర్థుల వివరాల పత్రాలు, గుర్తింపు కార్డులు, పోలింగ్‌ స్టేషన్ల వివరాలు, వివిధ పత్రాలను క్లస్టర్ల వారీగా అధికారులు సరిచేశారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు 8 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. కొఠారి క్లస్టర్‌ పరిధిలో కొఠారి, రింగన్‌ఘాట్‌, ధనోరా, పార్డ పంచాయతీలు ఉండగా.. నిసాని క్లస్టర్‌లో నిసాని, ఇందాపూర్‌, గోండ్‌గూడ, ఆగర్‌వాడ, కెలి– బి క్లస్టర్‌లో కెలి– బి, ఖైరీ, సాంగ్వి, సాకడ, భోలాపటార్‌, గోయగాం క్లస్టర్‌లో గోయగాం, సావర్‌ఖేడా, సుర్దాపూర్‌, ఝరి, దేవాపూర్‌ క్లస్టర్‌లో దేవాపూర్‌, తుమ్మగూడ, అనార్‌పల్లి, కరంజీవాడ, పరంధోలి క్లస్టర్‌లో పరంధోళి, బోరాలాల్‌గూడ, ముకదంగూడ, అంతాపూర్‌, మోడి క్లస్టర్‌లో మోడి, కేస్లాగూడ, జోడేఘాట్‌, మెట్టపిప్రి, బాబేఝరి, కెరమెరి క్టస్టర్‌లో కెరమెరి పంచాయతీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు వేయాలని ఎంపీడీవో వి.సురేశ్‌ తెలిపారు. ● లింగాపూర్‌ మండలంలోని 14 గ్రామ పంచాయతీల కోసం మూడు క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేశామని ఎంపీడీవో రామచందర్‌ తెలిపారు. కంచన్‌పల్లి, గుమ్నూర్‌(బి), మోతీపటార్‌, కొత్తపల్లి(సి), చోర్‌పల్లి పంచాయతీకి సంబంధించిన అభ్యర్థులు కంచన్‌పల్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలి. లింగాపూర్‌, పిట్టగూడ, మామిడిపల్లి, పిక్లాతండా పంచాయతీల్లోని అభ్యర్థులు లింగాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. అలాగే జాముల్‌ధర, చిన్నదాంపూర్‌, కీమానాయక్‌తండా, లొద్దిగూడ, ఎల్లాపటార్‌కు చెందిన వారు జాముల్‌ధర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలి. ● వాంకిడి మండలంలో నామినేషన్ల స్వీకరణకు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెండార, చౌపన్‌గూడ, ఇందాని, ఖమాన, సవాతి, బంబార, వాంకిడి పంచాయతీ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు.

తొలి విడత ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు 114 సర్పంచ్‌, 944 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరణ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కెరమెరి/లింగాపూర్‌/వాంకిడి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి జిల్లాలోని ఐదు మండలాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. తొలి విడతలో జైనూర్‌ మండలంలోని 26 పంచాయతీలు, 222 వార్డులు, కెరమెరి మండలంలోని 31 పంచాయతీలు, 250 వార్డులు, లింగాపూర్‌ మండలంలోని 14 పంచాయతీలు, 112 వార్డులు, సిర్పూర్‌(యూ) మండలం 15 పంచాయతీలు, 124 వార్డులు, వాంకిడి మండలం 28 పంచాయతీలు, 236 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఐదు మండలాల్లోని 114 సర్పంచ్‌ స్థానాలతోపాటు 944 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు 27 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. స్టేజ్‌ 1, 2 రిటర్నింగ్‌ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలతోపాటు మీడియా సెల్‌, ఎంపీఎంసీ కమిటీ, గ్రీవెన్స్‌ సెల్‌, కంట్రోల్‌ రూంల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేపట్టనున్నారు.

నేటి నుంచి నామినేషన్లు1
1/1

నేటి నుంచి నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement