పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలతో ఏర్పాట్లపై సమీక్షించారు. గురువారం ఉద యం 10.30 గంటల నుంచి మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించాలన్నారు. స్టాటిస్టిక్ సర్వేయలెన్స్, ప్లయింగ్ సర్వేయలెన్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. మొదటి విడతలో లింగాపూర్, సిర్పూర్– యూ, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో ఫారం– 1 నోటీసు ప్రకటించి 27 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. బ్యా లెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సింగిల్ నామినేషన్లు వచ్చే స్థానాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
ఆసిఫాబాద్‌అర్బన్: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రాజ్యాంగం అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత పౌరులు ప్రాథమిక హక్కులతో ప్రశాంతంగా జీవించేందుకు రాజ్యాంగం మా ర్గదర్శకమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి పనిచేయాలని సూచించారు. అ నంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


