
యూనివర్సిటీ ఫుట్‌బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు
కాసిపేట:మండలంలోని సోమగూడెంకు చెందిన గురునాథం శంకర్ యూనివర్సిటీస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బాదె శేఖర్ తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతన్న శంకర్ ఈనెల 18న హన్మకొండలో జరి గిన కాకతీయ యూనివర్సిటీ అంతర్ విశ్వవి ద్యాలయ పోటీల్లో ప్రతిభకనబర్చాడు. హైదరాబాద్‌లో జనవరిలో నిర్వహించే సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో శంకర్ కాకతీ య యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వ హించనున్నాడు. ఈసందర్భంగా కోచ్‌తోపాటు తోటి క్రీడాకారులు శంకర్‌ను అభినందించారు.