
చెదరని నెత్తుటి జ్ఞాపకాలు
నాటి నక్సలైట్ల దాడుల్లో 19 మంది పోలీసుల దుర్మరణం అమరుల కుటుంబాల్లో తీరని శోకం రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
ఖానాపూర్: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం.
ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు.
ఖానాపూర్‌లో అమరుల స్తూపం
ఖానాపూర్ పోలీస్‌ష్టేషన్‌లో పోలీసు అమవీరుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్‌తోపాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
సంఘటనల వివరాలివే..